యూరియా కొరతపై బీఆర్‌ఎస్‌ డ్రామాలు

– వీరి రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
– మండిపడ్డ వ్యవసాయ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్‌ 30: రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన ఆందోళనపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వం కారణమని విూకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇదంతా కావాలని చేస్తున్న డ్రామాగా ఆయన అభివర్ణించారు. రేవంత్‌ సర్కార్‌ను బద్నాం చేసేందుకే బీఆర్‌ఎస్‌ దిగజారుడు రాజకీయం చేస్తోందని విమర్శించారు. యూరియా సరఫరాలో నిర్లక్ష్యంపై కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్‌ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. యూరియాపై వారిది కపట నాటకమని, ఈ నాటకాలను రైతులు నమ్మరని అన్నారు. అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా బీఆర్‌ఎస్‌ కావాలనే ఆందోళన చేస్తోందన్నారు. ఎరువులు సరఫరా చేయని కేంద్రాన్ని నిలదీయకుండా గతంలో తాము అంతా గొప్పలు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని మంత్రి తుమ్మల ఎద్దేవా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *