– పంచాయతీలకు ఇవ్వకుంటే దీపాలు ఎలా పెట్టాం
– మీరు పెట్టిన ఈఎన్‌సీనే కొనసాగిస్తున్నాం
– కల్యాణలక్ష్మి ఎవరికి రాలేదో వివరాలు ఇవ్వండి
– అసెంబ్లీలో సీతక్క. సబిత, సునీతలకు మంత్రి సీతక్క కౌంటర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: కేంద్రం నుండి రావాల్సిన 15వ ఫైనాన్స్ నిధులు సర్పంచ్‌లు లేరు కాబట్టి రాలేదు.. ఆ నిధులు మురిగిపోతాయేమో అనే 42% రిజర్వేషన్ బిల్లు క్లియర్ అవకున్నా ఎన్నికలకు వెళ్లామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. అసెంబ్లీలో పంచాయతీరాజ్ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఏమీ ఇవ్వకుంటే ఇన్ని రోజులు విద్యుత్ దీపాలు ఎలా పెట్టాం.. అంత పారిశుధ్యం లేకపోతే ఊర్లు ఉంటాయా.. ప్రజలు విషజ్వరాల బా²రిన పడేవారు కదా అని వ్యాఖ్యానించారు. ఆదివాసుల నుంచి వచ్చిన తాను మంత్రి అవడం బీఆరఎస్ వాళ్లకు అస్సలు ఇష్టం లేదు.. మెదటి నుండి నా మీదనే వారి ఆరోపణలు.. మీరు పెట్టిన ఈఎన్‌సీనే ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాం.. మేము బాగా చేశాం.. మీరు చేయట్లేదు అంటారనే అదే అధికారిని కొనసాగిస్తున్నామని బీఆరఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలకు కౌంటర్ ఇచ్చారు. తాము నిన్న కాక మొన్ననే 98% మంది సర్పంచులతో ఈఎన్‌సీ కార్యాలయం నుండి మానిటర్ చేసే కార్యక్రమం చేపట్టామని, తాను ఎంత మంది సర్పంచులతో మాట్లాడినం.. ఏమేమి సమస్యలు చర్చకు వచ్చాయి అంతాá కూడా సభ ముందు పెడతాం అన్నారు. ఇప్పుడు కూడా నీళ్లు రానటువంటి గూడేలు, తండాలు ఎన్ని ఉన్నాయి అని తాను ప్రతి 15 రోజులకు లేదా నెలకు రివ్యూ చేస్తున్న.. తాగునీటి విషయం మీద ఒకసారి సబితా ఇంద్రరెడ్డి ఒక బాలుడు నీళ్ల పైపుతో ఆడుకుంటుంటే ఇష్యూ చేశారు.. ఒకవేళ మీరు అంత వ్యవస్థ ఏర్పాటు చేస్తే అది ఎటుపోయింది.. అంటే కేసీఆర్ లేకుంటే నీళ్లే రావు అనేలాగా క్రియేట్ చేశారని ఎద్దేవా చేశారు. ఇపుడు ఈ అసెంబ్లీ భవనం కట్టిన నిజాం లేడు.. అయినా ఈ భవనాన్ని మనం వాడుకోవట్లేదా.. అదేవిధంగా మిషన్ భగీరథను కాపాడాలని ఊర్లలో కూడా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం.. గ్రామ సభలలో కూడా మిషన్ భగీరథ ఆవశ్యకత తెలియజేసే కార్యక్రమాలు చేస్తున్నాం.. ఇవ్వాళ ఆర్ఓ వాటర్ తాగడం వల్ల మినరల్స్ కూడా ఫిల్టర్ విధానంలో కోల్పోతున్నాం.. అలా జరగకూడదు అని తీర్మానం చేస్తున్నాం. అలాంటి, పరిస్థితులలో నీళ్లు రావట్లేదు అని ఊరికే వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. మీరు ఎందుకు ఆవేదన పడుతున్నారో అర్ధం అవట్లేదన్నారు. తాను టీడీపీలో ఉన్నపుడు అధికారంలో లేను.. కాంగ్రెస్‌లో చేరినపుడు కూడా అధికారం ఉంటే చేరలేదు. సబిత కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి బీఆరఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు.. అప్పుడు మీ హయాంలో అన్నీ చేశాం అంటే ఇక నేను మాట్లాడేది ఏం ఉంటుంది అని ప్రశ్నించారు. అపుడేమో అన్నీ బాగున్నాయి అంటున్నారు.. ఇపుడు ఒక్క రోడ్డు లేదు.. వాటర్ ట్యాంక్ లేదు అంటున్నారు ఎలా సాధ్యం? ఇది సరికాదు అన్నారు. తాము రూ.57,000 కోట్ల రుణాలు వడ్డీ లేని రుణాల కింద ఇప్పించినం అంటే ప్రశ్నించినారు. అదే మీ హయాంలో బడ్జెట్‌లో వడ్డీ లేని రుణాల కోసం రూ.3000 కోట్లు పెట్టి కేవలం రూ.6 కోట్లు మంజూరు చేశారు.. అది ఉంది నా దగ్గర. నేను జవాబిచ్చేటపుడు సభ ముందు పెడతా అన్నారు. ఆమె కేటగిరీ వేరు.. నా కేటగిరీ వేరు.. ఆమె రాజ్యం వేరు.. నా రాజ్యం వేరు. వాళ్ళది హైదరాబాద్ సిటీ. మేము అడవి బిడ్డలం. మాకు ఎక్కడా వాళ్లతో పోలిక లేదు. మీ మీద మాకు వ్యక్తిగత ద్వేషం లేదు.. మీరు అన్న మాటలు మీరు ఒక్కసారి పరిశీలించుకోవాలి అని మంత్రి సీతక్క కోరారు. ఎవరికి కళ్యాణ లక్ష్మి పథకం రాలేదో వారి వివరాలు ఇవ్వండి అని సునీతలక్ష్మారెడ్డిని కోరారు. ఆ ఎంఆరఓ, ఆర్డిఓలను బాధ్యులను చేస్తాం.. ఆ అధికారి మీద చర్యలు తీసుకుంటాం.. ఆ డబ్బులు కూడా ఇప్పిస్తా.. వారి ఇంటికి పోయి ఇచ్చే ఏర్పాటు చేస్తాం.. తులం బంగారం పథకం ఇంకా మేము మొదలు పెట్టలేదు.. మీరు చాలా వాగ్దానాలు చేసి అసలే చేయకుండా పోయారు.. మాకు ఇంకా సమయం ఉంది. మేము ఏమేమి చేయాలో చేస్తాం.. మీరు దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. మూడు ఎకరాల భూమి అన్నారు.. ఒక్క ఎకరానికి 10 లక్షలు అనుకున్నా రూ.30 లక్షల ఖరీదు.. వాస్తవాలు ప్రశ్నిస్తే ఉక్రోష పడుతున్నారు. తాము ఇవి ఇయ్యలే అవి ఇయ్యలే అని చెప్తున్నారు కదా అవి నేను ఇప్పిస్తా అని మంత్రి సీతక్క అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





