విష ప్రచారం చేసినా జాతర విజయవంతం

– మేడారం జాతరపై మంత్రి సీతక్క చిట్‌చాట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడారం జాతర విజయవంతం అయ్యిందని, జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆమె చిట్‌చాట్ మాట్లాడుతూ కొంతమంది జాతరపై, ఏర్పాట్లపై విష ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దొంగతనం సంఘటనను కొందరు తప్పుడు ప్రచారం చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం జాతర ఏర్పాట్లు బాగున్నాయని ప్రశంసించారని, క్లాస్, మాస్‌తోపాటు హైక్లాస్ పీపుల్ కూడా జాతరకు భారీగా వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారని చెప్పారు. సుమారు రెండున్నర కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు భావిస్తున్నామన్నారు. ఒకట్రెండు రోజుల్లో తిరుగు జాతర జరుగుతుందని తెలిపారు. వచ్చే జాతర సమయానికి మేడారం చుట్టుపక్కల రోడ్లను మరింత వెడల్పు చేసి ట్రాఫిక్ జామ్‌లను నివారిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం ములుగు జిల్లా పరిధిలో పనులపై అధికారులతో సమీక్షిస్తానన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *