– అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మంత్రి రామ్మోహన్‌నాయుడు
దిల్లీ, జులై 21: అహ్మదాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (ఏఏఐబీ) నిర్వహిస్తోందని, అంతర్జాతీయ ప్రొటోకాల్‌కనుగుణంగా జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడిరచారు. ఈ ప్రమాదంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి రామ్మోహన్ నాయుడు అందుకు సంబంధించిన అంశాలను వివరించారు. ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, తుది నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు. అయితే ఈ ప్రమాదంపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు.. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపడతారు అని చెప్పారు. మొదటి దశ దర్యాప్తు ఇప్పటికే పూర్తవగా దానిపై నివేదికను ఏఏఐబీ విడుదల చేసింది. విమానంలోని బ్లాక్ బాక్స్‌కు కొంత నష్టం జరిగినట్లు తెలిసింది. సాధారణంగా, బ్లాక్ బాక్స్‌కు నష్టం జరిగినప్పుడు దాని విశ్లేషణ కోసం తయారీదారుకు పంపడం ఆనవాయితీ. అయితే, ఈసారి దేశంలోనే మొదటిసారిగా బ్లాక్‌బాక్స్ డీకోడిరగ్ ప్రక్రియ విజయవంతంగా జరిగిందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇది భారతదేశ పౌర విమానయాన రంగంలో ఒక ముఖ్యమైన విజయంగా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇలా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.





