– మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: గ్లోబల్ సమ్మిట్ ద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగనుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. డిజిటల్ టన్నెల్, సెషన్ హాల్‌లను పరిశీలించిన ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు. అనంతరం అక్కడే కనువిందు చేస్తున్న ఆర్టీసీలో మొదటి తరం ఆర్టీసీ బస్సు అల్బేన్ నుండి నేటి ఎలక్ట్రిక్ బస్సు వరకు ఆర్టీసీ అభివృద్ధి అని ప్రదర్శనగా ఉంచిన స్టాల్‌లో ఆర్టీసీ బస్సులను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఇతర ఆర్టీసీ, రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





