కామారెడ్డి, ప్రజాతంత్ర : రాష్ట్రంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ (Kamareddy Weather Alert) గా ఉందని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈమేరకు బుధవారం కామారెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

కామారెడ్డి, మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆయా జిల్లా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహించే రోడ్ల పైన వాహనాలను అనుమతించొద్దని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ టీమ్ లను ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపడుతున్నాయని తెలిపారు. వరద ముప్పు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి తగిన భోజన వసతి, వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
#Telangana #TelanganaNews #TelanganaRains #RainAlerts
రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్
రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉన్నదనీ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు, చర్యలు… pic.twitter.com/WNnFt4eYo3— Prajatantra (@ADevulapalli) August 27, 2025
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




