మేం చేస్తున్న పనులకు ధన్యవాదాలు చెప్పాలి

– మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. రేషన్ కార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలి. యంగ్ ఇండియా స్కూల్ కట్టినందుకు, ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పాలని అన్నారు. కేటీఆర్ ఓపికగా ఉండాలని మంత్రి హితవుపలికారు. ఈ ప్రభుత్వం పేదల కోసమే ఉందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిందని.. వాటికి తాము వడ్డీ కడుతున్నామని.. అందుకు ధన్యవాదాలు చెప్పాలంటూ కేటీఆర్కు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీటైన జవాబిచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *