– అందులో అనుమానం లేదన్న కోమటిరెడ్డి
– సీఎం రేవంత్ అంటే అభిమానమని వ్యాఖ్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2:తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ వొదిలిన బాణం కవిత అని ఆయన అభివర్ణించారు. కవిత కన్ఫ్యూజన్‌లో ఉండి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తోందని వ్యంగ్యంగా అన్నారు. కవిత ఏ పార్టీలో ఉందో స్పష్టం చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రి ద సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆమె.. హరీష్ రావు ద చేసిన వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు? అంటూ కవితను ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సీఎం స్పందనపై కవిత శుక్రవారం కాస్తా ఘాటుగా స్పందించారు. దీనికి కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి అంటే గౌరవమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎవరు ఏమన్నా అంటే కౌంటర్ ఇస్తానన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో డియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మంత్రి పదవి కోసం తాను ఏ రోజు పాకులాడలేదని చెప్పారు. మంత్రి పదవి కావాలంటూ తాను ఎవరిని అడగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే తాను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తనకు, తన తమ్మునికి మధ్య ఎటువంటి గొడవలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జనవరి 1వ తేదీ గురువారం సాయంత్రం ప్రజాభవన్‌లో జలాలు – నిజాలు అంశంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇచ్చారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పార్టీలోని సీనియర్లు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్టాన్రికి రావాల్సిన నీటి వాటా బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తోపాటు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వల్లే తగ్గిదంటూ సీఎం రేవంత్ కాస్త ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలపై కవిత మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.