ట్రైనీ డీఎస్పీ ప్రవీణ్ ను సన్మానించిన మంత్రి సీతక్క

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 12ః ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన డి.పి. ప్రవీణ్ గ్రూప్–I పరీక్షల్లో డీఎస్పీగా ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను ప్రత్యేకంగా కలిశారు. ప్రవీణ్‌ను మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి అభినందించారు. అనేక అవరోధాలు, కష్టాలను అధిగమించి కఠినమైన పోటీ పరీక్షలో విజయం సాధించిన ప్రవీణ్‌ను ఆదర్శంగా తీసుకొని యువత విద్యలో, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ తాను ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే సమయంలో సీతక్క తరచుగా తమ పాఠశాలను సందర్శించేవారని, ఆ సందర్భాల్లో ఆమె చెప్పిన మాటలు తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొన్నారు. ఆ ప్రోత్సాహమే తనను ఉన్నత లక్ష్యాల వైపు నడిపించిందని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *