ఏఐ ఇంపాక్ట్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్న మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్- 2026లో ఐటి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు. ఈనెల 16న ప్రారంభమైన ఈ అత్యున్నతస్థాయి సదస్సులో 20 దేశాల ముఖ్య నేతలు, ప్రతినిధులు, 40 దేశాలకు చెందిన నిపుణులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. గురు, శుక్రవారాల్లో నిర్వహించే పలు సమావేశాల్లో శ్రీధర్‌బాబు పొల్లొని కీలకోపన్యాసం చేస్తారు. గురువారం ఉదయం 9.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచప్థాయి ఏఐ నిపుణులు, పరిశోధకులు పాల్గొనే పలు కార్యక్రమాల్లో ఆయన ప్రసంగిస్తారు. యూఎస్- ఇండియా బిజినెస్ కౌన్సిల్ సభ్యులు (యూఎసఐబీసీ), దిగ్గజ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగాలకు చెందిన పలువురు ముఖ్యులతో ఆయన భేటీ అవుతారు. డిజిటల్ గవర్నెన్స్ అడ్వయిజరీ, ఆల్ బ్రైట్ స్టోన్ బ్రిడ్జ్ గ్రూప్(డీజీఏ-ఏఎస్‌జీ) వంటి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వయిజరీ సంస్థల ప్రతినిధులు, నిపుణులను ఉద్దేశించి కీలకోపన్యాసం చేస్తారు. స్వీడన్ వాణిజ్య బృందంతోనూ భేñటీ అవుతారు. కార్యక్రమాల్లో ఐటి, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *