హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నిమ్స్ హాస్పిటల్ ను సందర్శించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ కోలుకున్న విషయం తెలుసుకుని స్వయంగా వొచ్చి వారిని పరామర్శించారు.
విద్యార్థినులతో మాట్లాడి జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పూర్తిగా కోలుకొని స్కూల్ కి వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. మంత్రి వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, డాక్టర్లు నిమ్మ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్ ఉన్నారు.





