ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేయాలి

ఈ ప‌ర్య‌ట‌న చారిత్రాత్మ‌కం కావాలి
సి.ఎం. ప‌ర్య‌ట‌న‌తో రూపురేఖ‌లు మార‌నున్న జిల్లా
– స‌న్నాహ‌క స‌మావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ

జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  పర్యటన విజ‌య‌వంతం చేయ‌డానికి  అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లుసమన్వయంతో కృషిచేయాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్యకుటుంబ సంక్షేమ,సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికార్ల‌ను ఆదేశించారు.  ఈనెల 23న‌ జహీరాబాద్ లో ముఖ్యమంత్రి పర్యటించ‌నున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం కలెక్టరేట్ లో మంత్రి దామోదర్ రాజనర్సింహ   అధ్య‌క్ష‌త‌న స‌న్నాహ‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 23వ తారీకున సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తెలంగాణ రాష్ట్రంలో చారిత్రాత్మకం కావాలన్నారు. సీఎం  పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు.  అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళికసెక్యూరిటీ ,బందోబస్తుబారికేడ్లు ట్రాఫిక్ నియంత్రణత్రాగునీరు,హెలిప్యాడ్ హెల్త్ క్యాంప్ లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణకేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవంమహిళా పెట్రోల్ బంకుజిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసివివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల పై ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించి సభ లో పాల్గొంటారని తెలిపారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభిద్దామ‌న్నారు.  

నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ..  ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాటు చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డిజిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరుఎస్పీ పరితోష్ పంకజ్అదనపు కలెక్టర్ చంద్రశేఖర్సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *