– దేవుళ్లపై సీఎం వ్యాఖ్యలే నిదర్శనం
– సీఎం వ్యాఖ్యలను ఖండిరచిన కేంద్ర మంత్రి బండి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువులను, హిందూ దేవుళ్లను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసేదని. ముస్లిం అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ నరనరాల్లో హిందూ ద్వేషం నింపుకుందని, బీఆర్‌ఎస్ సైతం గతంలో పలుమార్లు హిందూ దేవుళ్లను, హిందూ సంస్కృతిని కించపర్చిందని అన్నారు. ఆనాడు సీఎంగా ఉంటూ కేసీఆర్ హిందుగాళ్లు.. బొందుగాళ్లు అంటూ హిందువులను అవహేళన చేశారని, ఈ విషయాన్ని ముందే పసిగట్టి మొన్నటి జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్‌ఎస్ గెలిస్తే హిందువులు తలెత్తుకుని బయట తిరగలేని ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించామన్నారు. సీఎం వ్యాఖ్యలను చూశాక ఇదే నిజమని తేలిపోయిందన్నారు. హిందూ సమాజం ఇకనైనా ఆలోచించుకోవాలని, ఓట్ల కోసం చీలిపోయి విడివిడిగా ఉంటూ అవహేళనను, అవమానాన్ని దిగమింగుకుంటూ ఉంటారో లేక ఏకమై హిందువుల సత్తాను చాటుతారో తేల్చుకోవాలి అని పిలుపునిచ్చారు. బీజేపీ ఏనాడూ ఇతర మతాలను కించపంచలేదని తెలిపారు. కఅన్ని మతాలను గౌరవించే పార్టీ బీజేపీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ దిశగా పనిచేస్తోందంటూ ప్రజలు వాస్తవాలు గమనించాలని సంజయ్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




