– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్ పార్టీలో ఎవరూ మిగలరని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డిని కాదని కేసీఆర్ దగ్గరికి వెళ్లే నేతలు ఎవరూ ఉండరని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఎవరు కూడా సిద్దంగా లేరన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి స్పందించారు. సోమవారం ఆయన మిడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. బీఆర్‌ఎస్.. పదేళ్లలో కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తాము రెండేళ్లలో బీఆర్‌ఎస్ నేతలపై ఎలాంటి అక్రమ కేసులు పెట్టలేదన్నారు. అక్రమంగా దోచుకున్న డబ్బులతో బీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలి తప్ప భయపడటం ఎందుకని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఎన్నో దుర్మార్గాలు జరిగాయన్నారు. అవన్నీ బయటపడాల్సి ఉందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




