– పూర్ణకుంభంతో ఘన స్వాగతం
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ఎస్సీల, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ మంగళవారం దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలను ఆలయ ఈవో వెంకట్రావు మంత్రి అడ్లూరికి అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





