హర్యానా, పంజాబ్‌ సీఎంలకు అడ్లూరి ఆహ్వానం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 6ః తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ హర్యానా, పంజాబ్‌ సీఎంలకు శనివారం ఆహ్వానాలు అందజేశారు. హర్యానా, పంజాబ్‌లకు వెళ్లిన ఆయన హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్‌ సైనీని కలిసి సమ్మిట్‌ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర పెట్టుబడుల వాతావరణం, టీఎస్‌`ఐపాస్‌ ద్వారా లభిస్తున్న వేగవంతమైన అనుమతులు, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న విధానం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిపై ఆయన సైనీకి వివరించారు. తెలంగాణ అభివృద్ధి వేగాన్ని హర్యానా సీఎం ప్రశంసించారు. కాగా, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హర్పాల్‌ సింగ్‌ను కలిసి సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానం అందించారు. పంజాబ్‌-తెలంగాణ ల మధ్య వ్యవసాయ ప్రాసెసింగ్‌, అగ్రిటెక్‌, ఎంఎస్‌ఎంఈ, స్టార్ట్‌అప్‌ సహకారాలు, పర్యాటక-సాంస్కృతిక మార్పిడి, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో భాగస్వామ్యం కల్పించే అవకాశాలపై విస్తృత చర్చ జరిగింది. తెలంగాణతో కలిసి పనిచేయాలని పంజాబ్‌ మంత్రి ఆసక్తి కనబరిచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *