పవన్‌ ‌కళ్యాణ్‌ ‌వ్యాఖ్యలు దురదృష్టకరం

– క్షమాపణలు చెప్పాలన్న మంత్రి అడ్లూరి
– కొండగట్టు ఆలయంలో ప్రత్యేక పూజలు

జగిత్యాల, ప్రజాతంత్ర,డి సెంబర్‌ 3: ‌తెలంగాణ ప్రజలను కించపరుస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కల్యాణ్‌ ‌చేసిన వ్యాఖ్యలు బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ అన్నారు. పవన్‌ ‌బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో  బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌కుమార్‌ ‌కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అదేవిధంగా బేతాళస్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొండగట్టులో ఇటీవల జరిగిన ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని హా ఇచ్చారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య ద్వారానే వారు ఉన్నత స్థానానికి చేరుతారన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ ‌పార్టీ డ్వాక్రా మహిళలను మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో రూ.590 కోట్లు వెచ్చించి నిరుపేదలకు రేషన్‌ ‌కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది తామే అన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు అంకితమని.. దోపిడీదారులకు, దొంగలకు కాదన్నారు. ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా సిఎం రేవంత్‌ ‌తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *