– బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు
ప్రాజెక్టులపై కాంగ్రెస్‌కు కనీస జ్ఞానం లేదు
-ౖ బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీష్‌రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాజెక్టులపై కనీస జ్ఞానం లేదని విమర్శించారు. మేడిగడ్డ టు మల్లన్న సాగర్ మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.84,000 కోట్లు అయితే తమ్మిడిహెట్టి టు ఎల్లంపల్లికి రూ. 35,000 వేల కోట్లట!.. కాళేశ్వరం పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం అయితే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరట.. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 మాత్రమేనట కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడోవంతు ఖర్చు చేస్తూ పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరట.. 35 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం. అమోఘం.. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం. ఇది కదా అసలైన మార్పంటే’ అంటూ ట్వీట్ చేశారు.
పండుగలకు వస్తే ప్రజలకు పాపమైంది
పండుగలు వస్తే ప్రజలకు పాపమైంది అన్నట్టుగా ప్రజల నుంచి భారీగా దండుకునేందుకు ప్రజలు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హరీశ్‌రావు మండిపడ్డారు. దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం చార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పండుగలు వస్తే చాలు ఆర్టీసీ బస్సు చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల నడ్డివిరిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమవుతుండటం సిగ్గుచేటన్నారు. పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో టికెట్ ధరలు విపరీతంగా పెంచి బతుకమ్మ, దసరా పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ముక్కు పిండి చార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అదనపు చార్జీల దోపిడీ ప్రయాణికులకు పెను భారంగా మారుతున్నదన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





