– ఉద్యమ ప్రస్తానంలో కీలక ఘట్టం : కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10: స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్‌బండ్‌పై యావత్ తెలంగాణ ప్రజలు ఏకమై గర్జించి నేటికి 15 ఏళ్లు పూర్తయిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం నాడు ఉద్యమ ప్రస్థానం ఉవ్వెత్తున ఎగిసిందని, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన కీలక ఘట్టాల్లో మిలియన్ మార్చ్ ఒకటని ఆయన పేర్కొన్నారు. 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ సందర్భంగా నిర్బంధాలు, దిగ్బంధాలు, అడ్డంకులు, బ్యారీకేడ్‌లు, ఇనుపకంచెలు ఇవేవీ తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. లక్షల గొంతుకలు తెలంగాణ రాష్ట్రం కోసం ట్యాంక్‌బండ్‌పై నినదించిన అద్భుత పోరాట రూపానికి నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరులకు జోహార్లు, జై తెలంగాణ అంటూ తన పోస్టును ముగించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.