– ఏడాదిగా బిల్లులు, వేతనాలు చెల్లించకపోవడం దారుణం
– మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: కాంగ్రెస్ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని ఆవేదన, ఆందోళన చెందవద్దని, మీ డిమాండ్లు నెరవేరే వరకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులకు బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి..హరీష్‌రావు భరోసా ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల రేవంత్ సర్కారు కర్కశంగా, కఠినంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమన్నారు. ఏడాదిగా పెండిరగ్ బిల్లులు, వేతనాలు చెల్లించడంలేదని, మీరైనా పట్టించుకుని ప్రభుత్వాన్ని నిలదీయాలని వరంగల్ మధ్యాహ్న భోజనం కార్మికులు హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండిరగ్ బిల్లులు, వేతనాల కోసం కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణమన్నారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని నమ్మించి, ఇప్పుడు నయవంచన చేయడం ద్రోహం చేయడమే అవుతుందని అన్నారు. ఉన్నఫళంగా మధ్యాహ్న భోజన పథకం నుంచి దూరం చేస్తే 20 ఏండ్లుగా పనిచేస్తున్న ఆ కార్మికుల పరిస్థితి ఏం కావాలి అని నిలదీశారు. ఏడాది కాలంగా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనాలు పెట్టిన ఆ చిరు ఉద్యోగుల ఆర్థిక భారం ఎవరు తీర్చాలి అని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన కార్మికుల బతుకులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్న విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ కార్మికుల పెండిరగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలని బీఆర్‌ఎస్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీష్‌రావు అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





