సాంకేతిక లోపంతో నిలిచిన మెట్రో సర్వీసులు

– కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఇబ్బంది

హైదరాబాద్‌,‌ప్రజాతంత్రర,మార్చి 20: నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్‌ ‌మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్‌ -‌రాయదుర్గం (బ్లూ లైన్‌) ‌మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ ‌చెక్‌పోస్ట్ ‌స్టేషన్‌లో అకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు 12 నిమిషాలపాటు నిలిచిపోయింది. దీంతో ఇరు మార్గాల్లో మెట్రో రైళ్లను ఆపేయ‌గా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 నిమిషాలపాటు సేవలు నిలిచిపోయాయి. మరమ్మతుల అనంతరం మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా రైళ్లు నిలిచిపోవడంతో కార్యాలయాలకు, ఇతర పనులకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో సిబ్బంది వెంటనే స్పందించి సాంకేతిక లోపాన్ని సరిచేశారు. రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని మెట్రో అధికారులు తెలిపారు. అయితే తరచూ ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటం పట్ల ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం సరైన నిర్వహణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *