» అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : గ్రేటర్ హైదరాబాద్ లో శివారు ప్రాంతాల విలీనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రజలతో సంప్రదిం పులు జరిపిన తరువాతే చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం తెలం గాణ అసెంబ్లీలో గ్రేటర్ విలీనంపై జరిగిన చర్చలో ఆయన ఈ విషయాన్ని వివరించారు. గ్రేటర్ విలీనంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. శుక్రవారం (జనవరి2) మంత్రి శ్రీధర్ బాబు గ్రేటర్ లో శివారు ప్రాంతాల విలీనంపై వివ రించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతోనే విలీనం చేశామన్నారు. సుస్థిర అభివృద్ధి కోసమే సిటీకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశామన్నారు. జీహెచ్ఎంసీలో శివారు ప్రాం తాలను విలీనం ఎలాంటి సంప్రదింపులు లే కుండా విలీనం చేశారని ప్రతిపక్షాలు విమర్శిం చగా.. మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చా రు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే జీహెచ్ఎంసీలో విలీనం చేశామన్నారు. జీహెచ్ఎంసీ ని300 వార్డులుగా విభజించా మన్నారు. విభజన సమయంలో 5వేల 935 ప్రజలనుంచి సూచనలు రాగా.. వాటిలో 1127 సూచనలను ఆమోదించా మన్నారు. సరిహద్దుల మార్పుపై కూడా సూచనలు స్వీకరించామన్నారు. దాదాపు 27 శాతం ప్రజల సూచనలను పరిగణ నలోకి తీసుకొని విభజించామన్నారు. 14ఏళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జనాభా రెండింతలు పెరిగింది.. సిటీ పరిధి లోని తెల్లాపూర్ లో ఏడాదిలోనే జనాభా రెండింతలు పెరింగిందన్నారు. ఇక గ్రేటర్ లో శివారు ప్రాంతాల విలీనం ప్రతిపక్షాలు విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. విలీనంపై సంప్రదిం పులు లేవన్నది అవాస్తవం.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ లో పెద్ద ఎత్తున చర్చ జరిగిందన్నారు. గత ఏడాది కాలంగా విలీనం ప్రక్రియ జరుగుతోంది.. ప్రజాస్వా మ్య విధానంలోనే గ్రేటర్ విలీనం జరిగింది.. సుస్థిర అభివృద్ధికి కోస మే గ్రేటర్ లో విలీనం చేశామన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విలీనం జరి గింది.. సాధారణ ప్రజలతో కూడా సంప్రదిం పులు చేశామన్నారు. గ్రేటర్ పరిధిలోని ప్రజలకు సమాన సర్వీసులు అందిస్తామన్నా రు. విలీనం నిర్ణయం శివారు ప్రాంతాలకు కూడా ఆర్థిక వనరులను అందిస్తుందన్నారు. మున్సిపల్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అ న్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



