– 100 పోస్టుల భర్తీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23 : ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అపోలో ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయంలో దీనిని నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలోని ఫార్మసిస్టు, అసిస్టెంట్ ఫార్మసిస్టుల 100 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డి- ఫార్మసీ, బీ-ఫార్మసీ, ఎం-ఫార్మసీ, ఏదైనా డిగ్రీ చేసిన యువతీయువకులు 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.12,000 నుండి రూ.25,000 వేల వరకు వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు టి.రఘుపతి, హెచ్‌ఆర్ (ఫోన్ 8247656356)ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లామెంట్ బ్యూరో(UEI&GB/MCC) వద్ద నేరుగా 28న హాజరు కావాలని కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



