– పాల్గొననున్న 200 కంపెనీలు
– నిరుద్యోగ నిర్ములనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి
– ప్రభుత్వం అధ్వర్యంలోనే జాబ్ మేలా
– నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
-మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21 :నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాల కల్పననే లక్ష్యంగా ఈ నెల 25న హుజూర్‌గర్ నియోజకవర్గ కేంద్రంలో మెగా జాబ్ మేలా నిర్వహిస్తున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తున్నదని, ప్రభుత్వపరంగా ఇప్పటికే 70 నుండి 75 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేయడంతోపాటు తాజాగా గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ నియామకాల పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశామని చెప్పారు. అంతే కాక లైసెన్స్‌డ్ సర్వేవర్‌లను కూడా నియమించామని వెల్లడిరచారు. హుజూర్‌నగర్‌లో ఈ నెల 25న మెగా జాబ్ మేలా జరపతలబెట్టిన విజ్ఞాన్ పాఠశాల, స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్స్‌లో ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. శాసనమండలి సభ్యుడు శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నానాటకీ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య దేశానికి ఒక సవాల్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదురైన అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్యేనని దీని పరిష్కారనికి తాను ప్రత్యేకంగా చొరవ తీసుకుని పరిశ్రమల శాఖాకు అనుబంధంగా ఏర్పాటైన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణతోపాటు సింగరేణి కాలరీస్ యజమాన్యంతో సంప్రదించి భారీస్థాయిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ మేళాలో పాల్గొనేందుకు 205పై చిలుకు కంపెనీలు రిజిస్ట్రేషన్ చేసుకోగా 9,500పై చిలుకు నిరుద్యోగులు తమతమ పేర్లు నమోదు చేసుకున్నారని వివరించారు. విశాఖ అస్బెస్టాస్ వంటి పేరెన్నికగన్న పరిశ్రమలతో తానే స్వయంగా మాట్లాడి అహ్వానించడంతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పరిశ్రమలు జాబ్ మేలాకు హాజరై తమ కంపెనీలలో ఖాళీలనుబట్టి నియమకాలు జరిపేందుకు అంగీకరించాయన్నారు. ఉపాధి కోసం నిరీక్షిస్తున్న యువత ఈ జాబ్ మేలాలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం ఒక యజ్ఞంలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదే సమయంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా జాబ్ మేలాలో పాల్గొనేందుకు గ్రామీణ యువత పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





