– పాదయాత్ర, దిల్లీ పర్యటనపై చర్చించిన నేతలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు కాంగ్రెస్ పాదయాత్ర జరగనున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లు సమావేశమయ్యారు. పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢల్లీిలో పోరాటం కార్యాచరణపై దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చించారు. బీసీ 42 రిజర్వేషన్ల బిల్లుపై ఆగస్టు 5,6,7 తేదీలు మూడు రోజులపాటు ఢల్లీిలో కార్యాచరణ గురించి అందులో 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టు.
6న జంతర్ మంతర్ వద్ద ధర్నా. పాల్గొననున్న ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వం, బీసీ సంఘాల నాయకులు, 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పించడం గురించి చర్చించారు.
ప్రత్యేక రైలులో ప్రతీ నియోజకవర్గం నుంచి 50 మంది ధిల్లీికి బయల్దేరాలని పార్టీ బాధ్యులకు సూచించారు. దిల్లీ పర్యటన అనంతరం యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.



