Medigadda: మేడిగడ్డ వంటి ఘటనలు పునరావృతం కానివ్వం

– కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికే ముఖ్యం
– స్పీకర్‌ పరిధిలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం
– మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి

కరీంనగర్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 11: మేడిగడ్డ ప్రాజెక్ట్‌ వంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్‌ డ్యాం సేప్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా ముందుకెళ్తామన్నారు. మంత్రి శ్రీధర్‌ బాబు సొమవారం కరీంనగర్‌లో పర్యటించిన సందర్భంగా విూడియాతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై సిట్‌ దర్యాప్తు చేస్తోందని, ఎవరెవరిని విచారణకు పిలవాలన్నది సిట్‌ అధికారులే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. విచారణలో రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. బీజేపీ.. బీఆర్‌ఎస్‌తో లోపాయికారీగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. తమ మేనిఫేస్టోలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యుడీషియరీ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని, అన్నట్లుగానే వేశామని గుర్తుచేశారు. సోమవారం రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండిరగ్‌లో ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఎనిమిదిమంది బీజేపీ ఎంపీలు బీసీ బిల్లులను ఆమోదించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు. జంతర్‌మంతర్‌ వద్ద తమ నిరసన ధర్నాకు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. బీసీల గురించి ఆ పార్టీ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని  దేశ ఆర్మీ చీఫ్‌ మాట్లాడటాన్ని భారత్‌ కూడా ఖండిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *