అవసరం లేకున్నా మెడికల్ ఇన్‌వాలిడేషన్

– సింగరేణిపై అదనపు భారం
– దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కమిటీ
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అవసరం లేకపోయినా మెడికల్ ఇన్‌వాలిడేషన్ మూలంగా సింగరేణిపై ఆర్థికంగా భారం పడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామన్నారు. శాసనమండలిలో బీఆర్ఎస్‌ సభ్యుడు మధుసూదనాచారి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. 2000 నుంచి 2014 వరకు 14 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్‌వాలిడేషన్ సంఖ్య 3,859 మాత్రమేనని, 2014 నుంచి 2023 వరకు అయిదేళ్లలో 13,119 మంది మెడికల్ ఇన్‌వాలిడేషన్ తీసుకున్నారని వివరించారు. ఇది దుర్వినియోగం అవుతోందని భావించి కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్‌లో నిబంధనలు పరిశీలించి పా, మైనింగ్ జీఎం, ఒక నామినేటెడ్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. మెడికల్ ఇన్‌వాలిడేషన్ వారిని వదిలేయకుండా మానవీయ కోణంలో పరిశీలించి ఆధారపడిన కుటుంబాలను అనుమతించాలని నిర్ణయించామన్నారు. గత రెండేళ్లల్లో 14సార్లు మెడికల్ బోర్డు సమావేశం జరగగా 2024లో 1041 మందికి, 2025లో 949 మందికి మెడికల్ ఇన్‌వాలిడేషన్ కింద డిపెండెంట్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న మార్కెట్ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మానవీయ కోణంలో సింగరేణిలో రేషనలైజేషన్ కోసం ప్రయత్నం జరగాలన్నారు.

మార్కెట్ పరిస్థితులకనుగుణంగా మార్పులు చేసుకోవాలి

రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నదని, దీనిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే మార్కెట్ పరిస్థితులÅ£నుగుణంగా మార్పులు చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని భట్టి చెప్పారు. సింగరేణిలో టన్ను బొగ్గు ధర రూ.4088 కాగా కోల్ ఇండియాలో అదే టన్ను బొగ్గు ధర రూ.1065, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో రూ.2169కి లభిస్తున్నదని, సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గులో 30 శాతం జెన్కోకు వెళుతున్నదని, బహిరంగ మార్కెట్‌లో దొరికే బొగ్గు కన్నా ఎక్కువ ధరకు సింగరేణి నుంచి కొనుగోలు చేస్తుండడంతో జెన్కోపై ఉత్పత్తి భారం పడుతున్నదŠని, ఫలితంగా రాష్ట్రంలోని 3.55 కోట్ల జనాభాపై ఆర్థిక భారం పడుతోందని డిప్యూటీ సీఎం తెలిపారు. అదే సందర్భంలో కోల్ ఇండియా నుంచి జెన్‌కో బొగ్గును కొనుగోలు చేస్తే యూనిట్‌పై రూ.2 భారం తగ్గుతుందని, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ నుంచి తీసుకుంటే ఒక్కో యూనిట్‌పై రూ.1.25 అదనకు భారం తగ్గుతుందని, నిర్దిష్ట నిర్ణయాలు తీసుకొని సింగరేణి సంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సింగరేణి, జెన్కో రెండూ ప్రభుత్వ సంస్థలేనని, వీటిని బ్యాలెన్స్ చేస్తూ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. ఇతర కోల్ సంస్థల ధరలతో సింగరేణి ఉత్పత్తి ధరలను మ్యాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని, అలా చేస్తేనే భవిష్యత్తు తరాలకు సింగరేణి సంస్థను అందించగలుగుతామని డిప్యూటీ సీఎం చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *