– 200 ఏళ్లు నిలిచేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు
– డిసెంబర్ 31లోపు కీలక పనులు, జనవరి 5లోపు పూర్తి
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 మేడా రం జాతర సందర్భంగా రెండు వందల ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌ ర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి స్పష్టం చేశారు. జాతర సందర్భంగా తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు మేడారం చేరుకొని అమ్మవార్ల దీవెనలు పొందుతున్నారని తెలిపారు. మంగళవారం మంత్రి అనసూయ సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్. కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, డిఎఫ్ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను, సాండ్ స్టోన్ బోమ్మల లిపి చిత్రాలను, క్యూ లైన్ నిర్మాణ పనులను, గోవిందరాజు పగిడిద్దరాజుల గద్దెల నిర్మాణ పనులు, ఆలయ ఫ్లోరింగ్ పనులను ఆలయ ప్రహరీలో వెదురు బొంగు మాదిరిగా ఉన్న స్తంభాలను, మేడారంలో చిలుకలగుట్ట రోడ్డు, స్తూపం, కన్నెపల్లి, జంపన్నవాగు, ఆర్. టి.సి. బస్ స్టేషన్ వద్ద అభివృద్ధి పనులను పరి శీలించారు. అనంతరం మేడారంలోని ఉన్నత స్థాయి అధికారులు, కాంట్రాక్టర్లతో జాతర పనుల పురోగతిపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ పనులు, రాతి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్ గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయ టి వైపు సీసీ రోడ్ల పనులు డిసెంబర్ 31వ తేదీ లోపు. ఇతర పనులు జనవరి 5లోపు పూర్తి పూర్తిచే యాలని అధికారులు, ఆదేశిం చారు. ప్రధాన ద్వారం పనులు కూడా జనవరి 5వ తేదీ లోపు పూర్తిచేయాలని సూచించారు. ఆలయ ప్రాంగణం గద్దెల పరిసర ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా త్వరితగతిన లైటింగ్ పనులను పూర్తి చేయాలని రహదారికి ఇరువైపులా విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, గద్దెలకు చేరుకునే హరిత వై జంక్ష న్ నుంచి గద్దెల ప్రాంగణం వరకు సెంట్రల్ లైటింగ్ పనులను కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. జాతర సమయంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రతిపాదికన వాటర్ ట్యాంకులను నిర్మించా లని అధికారులు పనులను విభజన చేసుకొని సకాలంలో నిర్దేశించిన గడువులోపు పూర్తి ఆదేశించారు. జాతరకు వొచ్చే అన్ని రహదా రుల నిర్మాణం పూర్తి చేయాలని, ఐటిడిఏ ఆధ్వ ర్యంలో తాత్కాలిక పనులకు ప్రాధాన్యత ఇ వ్వకుండా, శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధా న్యం ఇవ్వాలని, కూడలిలో గ్రాస్ ప్లాంటేషన్ పనులు, రహదారికి ఇరువైపులా మొక్కలను నాటించాలని అన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు వచ్చే జాతర కు సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వం బ్రహ్మాండంగా నిర్వ
హిస్తుందని గతంలో కంటే కూడా 200 శాతం భక్తుల సంఖ్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అన్నారు.అధికారులు పట్టుదలతో 31వ తేదీ లోపు పనులను పూర్తి చేయాలని, భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపద్యం లో పోలీస్ శాఖ ఆర్ అండ్ బి అధికారులు సమన్వయం లో పని చేయాలని, వన దేవతల ఆశీసుల తో పను లు సాఫీగా సాగుతున్నాయని మంత్రి అనసూ య సీతక్క అన్నారు. గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జాతరను విజయ వంతం చేయాలని ఎంపీ బలరాం నాయక్ అన్నారుఅనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస రెడ్డి మాట్లాడు తూ గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టి పడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలచే పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, తక్కువ సమయంలో 100 శాతం పని చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. చిన్నచిన్న అవాంతరాలు కలుగుతున్నప్పటికీ 5వ తేదీ లోగా పనులు పూర్తి అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మేడారం మహా జాతరను పురస్కరించుకొని ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్య మంత్రి, సహచర మంత్రులు, ప్రతిపక్ష నాయకులను ఆహ్వానిస్తున్నామని, అమ్మవార్ల దీవెనలు ప్రతి ఒక్కరిపై, దేశంపై ఉండాలని అన్నారు. అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులను దేవాలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులు ఎంతగానో ఆకట్టుకోనున్నాయని. ని స్వార్ధంగా దైవ కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గద్దెల ప్రాంతాలలో విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడంతో రోడ్డు విస్తరణ పనులు చురుకుగా కొనసాగుతు న్నాయని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా 29 ఎకరాల భూసేకరణ చేపట్టి పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలు ఇతర ప్రాంతాల నుంచి రప్పిస్తున్నామని, అమ్మ దయ వల్ల సకాలంలో పనులు పూర్తి అవుతాయని అభిప్రాయపడ్డారు. రాబోయే తరాల వారికి అమ్మవార్ల చరిత్రలు తెలిసే విధంగా శిల్పాలను ఏర్పాటు చేస్తున్నామని, స్వస్తిక్ ఏర్పాటు విషయంలో గిరిజనుల సాంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేస్తున్నామని దీనిపై ఎవరు రాద్దాంతం చేయ వద్దని కోరారు. పకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవింద రాజుల గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నా మని, తామంతా ఒక టీంగా పనిచేస్తూ జాతర ను విజయవంతం చేయడానికి కృషి చేస్తు న్నామని తెలిపారు. మహా జాతరను పురస్కరిం చుకొని ప్రతి గడప గడప నుండి భక్తులు వచ్చి అమ్మవార్ల దీవెనలు పొందాలని కోరుతూ, జాతర విశిష్టతపై పాత్రికేయులు సైతం ప్రచా రం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఎం పీ బలరాం నాయక్ మాట్లాడుతూ మహా జాత రను పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి కోట్లాది రూపా యలతో పనులు చేపట్టడం అర్శించదగ్గ విష యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆర్ అండ్ బి, పి ఆర్ ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంక టేష్, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటక్చర్, కాంట్రాక్టర్ల, అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





