– చైర్మన్ ఇర్ఫ సునీల్ దొర సహా 15మంది డైరెక్టర్ల ప్రమాణం
ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం శనివారం నియమించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా ఇర్ప సుకన్య సునీల్ దొర, మరో 15మందిని డైరెక్టర్లుగా నియమించారు. బోర్డు సభ్యులతో మేడారం ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరస్వామి ప్రమాణం చేయించారు. వీరి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క హాజరయ్యారు. అనంతరం మేడారం ట్రస్ట్ బోర్డు సభ్యులను మంత్రి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




