సమ్మక్క-సారలమ్మ దేవాలయం పున:ప్రారంభం

-మొక్కులు తీర్చుకున్న సీఎం రేవంత్
– హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు

తాడ్వాయి, ప్రజాతంత్ర, జనవరి 19: ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్న మేడారం సమ్మక్క- సారలమ్మ ఆల యాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమ వారం పున: ప్రారంభించారు. దేవతలకు పట్టువస్త్రాలు, పూలు, గాజులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మ వార్ల కు మొక్కులు తీర్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటించారు. ఆదివారం మేడారంలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరిత హోటల్ ప్రాంగణంలో క్యాబినెట్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. తనకేదైనా ఆపద వస్తే మొదటగా తాను నిర్మించిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం గుర్తొస్తుందని వ్యాఖ్యానించారు. తిరుపతి స్థాయిలో మేడారంలో నిత్యం వసతులు ఏర్పాటు చేస్తామని సీఎం పేర్కొన్నారు. వీరత్వమే దైవత్వంగా మారిన ప్రదేశం మేడారం అని పేర్కొన్నారు. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *