– ఊహించిన దానికన్నా పెరిగిన భక్తుల సంఖ్య
– మంత్రి సీతక్క వెల్లడి
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమక్క`సారలమ్మ మహాజాతర విజయవంతం అయిందని పంచాయతీరాజ్, గ్రావిÖణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) పేర్కొన్నారు. జాతరకు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని తెలిపారు. సోమవారం ఇక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ భక్తులకు చిన్నచిన్న అసౌకర్యాలు కలిగినందుకు చింతిస్తున్నామని చెప్పారు. వీవీఐపీల తాకిడి వల్లే ట్రాఫిక్ జామ్ అయిం<న్నారు. సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లతో తమకు భావోద్వేగ బంధం ఉన్నందుకే అన్ని జాగ్రత్తలు చేపట్టామని వివరించారు. జాతరకు వెళ్తే ఏదో జరుగుతుందని, జాతరను తక్కువ చేసి చూపాలని ఓ వర్గం కుటిల ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ జాతరకు జనం తండోపతండాలుగా తరలివచ్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు. మహాజాతర అనంతరం తాను పారిపోయినట్లు కొందరు తప్ప్పుడు ప్రచారం చేయడంపై ఫైర్ అయ్యారు. తాను ప్రజల కోసం పంతం నెగ్గించుకునే వ్యక్తినని, ఆదివాసీల అస్తిత్వం కోసం పరితపించే బిడ్డనని సీతక్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





