మెద‌క్ జిల్లా క‌ల‌ను నిజం చేసిన కె.సి.ఆర్‌.

– సిద్దిపేట‌, మెద‌క్‌గా బాగా అభివృద్ధి చెందాయి
-ఘ‌ణ‌పురం కాలువ ఆధునికీక‌రించేరు
– స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ జెండా ఎగ‌రాలి
– మాజీ మంత్రి హ‌రీష్‌రావు పిలుపు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 7:  ఇక్కడ ఉన్నోళ్లు అందరూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారేన‌ని,
మెదక్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్ట‌మ‌ని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో సోమ‌వారం మెద‌క్ కాంగ్రెస్ నాయ‌కులు బీఆర్ ఎస్‌లో చేరిన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. మెదక్ జిల్లా కలను నిజం చేసింది కేసీఆర్. నాలుగు లైన్ల రోడ్లు, డివైడర్లు, అద్భుతంగా ఉన్నాయి.. సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడుదులు ఎక్కువ ఉండే అనేవాళ్ళు. ఇప్పుడు అద్భుతంగా అభివృద్ధి చెందాయ‌న్నారు. రామాయంపేట డిగ్రీ కాలేజి, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్డి డిగ్రీ కాలేజి తెచ్చుకు న్నాం. ఘణపురం కాలువ ఆధునికీక‌ర‌ణ చేయ‌డ‌మే కాదు  చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు అందేలా చేసిన ఘ‌న‌త కె.సి.ఆర్‌.దేన‌న్నారు.  నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాంగ్రెస్ పాలన ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. కెసిఆర్ ఇచ్చిన ట్రాక్టర్ల డీజిల్ పోయాక అవి మూలన పడిపోయాయి. వారంలో పది రోజులు కూడా ట్రాక్టర్లు నడవడం లేదు. బుగ్గలు వేసే వాళ్ళు లేరు. పరిపాలన కుంటు పడింది. కేసీఆర్  నాట్లకు నాట్లు మధ్య ఇస్తే, కాంగ్రెస్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతు బంధు వేస్తున్నారని ఎద్దేవా చేశారు. కరోనా ఉన్నా కష్టం ఉన్నా కేసీఆర్  రైతు బంధు ఆపలేదు. మెదక్ జిల్లా పరిషత్, మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురుతుంద‌న్నారు.  కాళేశ్వరం నీళ్లు మెదక్ కు కూడా వస్తాయి. మోటార్లు ఆన్ చేయాలని అడిగితే పిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.  శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులు అయ్యింది అబద్దమా? మోటార్లు ఆన్ చేయనిది అబద్దమా? 65 టీఎంసీ  వినియోగించకుండా ఏపీకి నీళ్ళు వదిలింది అబద్దమా?పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి కృష్ణ నీళ్లు తీసుకుపోతుంటే నువ్వు  కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకుండా మోసం చేయడం అబద్దమా?  లక్ష క్యూసెక్కులు గోదావరిలో పోతున్నది నిజం కాదా.నీళ్ళు ఆంధ్రాకు నిధులు దిల్లీకి అన్నట్లు ఉంది రేవంత్ పాలన అంటూ ఎద్దేవా చేశారు.  అందరం కలిసి పని చేద్దాం స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా ఎగరేద్దామ‌ని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *