సింగరేణిలో ‘పంచ భూతాల’ కుంభకోణం

– రేవంత్ పాలనలో ‘సృజన్ గని’గా మారింది
– సింగరేణి సోలార్, ఓబీ టెండర్లలో రూ.500 కోట్ల కుంభకోణం
– ‘సిట్’ అంటే రేవంత్ రెడ్డి రాసుకున్న ‘స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’
– బావమరిది అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ పై కక్షసాధింపు
– నిప్పులు చెరిగిన‌ మాజీ మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకునేందుకే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, సింగరేణిలో జరుగుతున్న అవినీతి పూర్తి ఆధారాలతో బయటపెట్టారు. *హరీష్ రావు కామెంట్స్* ఈరోజు రాష్ట్రంలో సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు.. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారింది. వరుసగా మీడియాకు లీకులు ఇస్తున్నారు.. ఆ లీకులకు ఆధారాలు ఏమిటి.. మీడియా సంస్థలు కూడా నిజంగానే జరుగుతున్నట్టు ఆ లీకులను ప్రసారం చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులు వేరు.. ఇస్తున్న లీకులు వేరు. మొన్న నేను ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళినప్పుడు కూడా నాపైన ఇలాంటి దుష్ప్రచారం చేశారు.. వాస్తవానికి జరిగింది వేరు. బయట లీకులు ఇస్తూ ప్రచారం చేయించిన స్క్రిప్ట్ వేరు.. ఒకరకంగా ఇది రాజ్యాంగం మీద దాడి. వ్యక్తిత్వ హననం అవుతుంది. ఈ లీకులకు బాధ్యత వహించాలి? లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. మీడియాను కూడా నేను దయచేసి ప్రార్థిస్తున్నా.. లీకులను మీరు యథా విధంగా ప్రసారం చేస్తున్నారు. వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలి. 90 శాతం లీకులు సత్యదూరం.. మాకు మీడియాతో బాగుండడం అలవాటు. డిఫమేషన్ వేస్తే బాగోదు. వేస్తే ఎవరి మీద వేయాలి. పత్రిక మీద, టీవీ ఛానల్ మీద వేయాలి. అది వేయలేము.. ఈరోజు కేటీఆర్ గారి విషయంలో కూడా మీరు పదే పదే దుష్ప్రచారాన్ని, తప్పుడు లీకులను ప్రసారం చేశారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లీకు వార్తల విషయంలో చిల్లర రాజకీయాలు, డ్రామాలు చేస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి పిరికితనానికి నిదర్శనం. చాతకాని వాళ్ళు చేసే పనేది. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే వీడియో బయట పెట్టు.. దమ్ముంటే నువ్విచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేయి.. డైవర్షన్ పాలిటిక్స్ ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. నీకు చేతకాక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావ్.. ప్రజలకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి దగ్గర ఈ విషయం అంతా ప్రారంభమైంది.. ఆధారాలతో రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి బాగోతం బయటపెట్టినందుకే ఈ తతంగమంతా ప్రారంభమైంది. . తెలంగాణ సిరుల గని సింగరేణి అని. నేటి మాట ఏమిటంటే సింగరేణి సృజన్ గనిగా మారిపోయింది. ఒక మంత్రి తన సోదరుని కంపెనీకి సైట్ విసిట్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆ మంత్రి గారు ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామి అయ్యుండి మా కంపెనీకి సైటు విజిట్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరు అని అధికారికి ఉత్తరం రాశాడు.. ఈ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారింది. సిట్టు పేరు మీద రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించారు.. ఇదొక మైన్ బ్లాక్ కుంభకోణం కాదు. ఇది చాలా పెద్ద కుంభకోణం. బావమరిది సృజన్ రెడ్డి కోసం చేసిన ఈ కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారింది. మొదటిసారి ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టింది. ఇది ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు.. రేవంత్ రెడ్డి చేసిన ఈ బొగ్గు కుంభకోణం వల్ల తెలంగాణ ప్రతిష్ట దెబ్బతిన్నది. కోల్ స్కాం ఎట్లా అయితే యూపీఏ ప్రభుత్వ పతనానికి దారితీసిందో నేటి ఈ బొగ్గు కుంభకోణంతో కాంగ్రెస్ పతనానికి బీజం పడింది. యూపీఏ ప్రభుత్వంలో కోల్ స్కాం 1,50,000 కోట్ల స్కాం.. అది మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఈ గండం గట్టేక్కేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీతో కుమ్మక్కై ఈ సిట్ల డ్రామా చేస్తున్నాడు. ఈ డ్రామాలో భాగంగా మొన్న నాకు నేడు కేటీఆర్ గారికి సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెడుతున్నాడు.. మొన్న నన్ను పిలిచిన నాడు ఇదే తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సృజన్ రెడ్డి బాగోతాలను ఆధారాలతో సహా బయట పెట్టారు. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి బాగోతం ఆధారాలతో సహా బయటపెట్టినందుకే కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. అట్ల భయపడేది ఉంటే మేము తెలంగాణ ఉద్యమాలు చేసేవాళ్లం కాదు. ప్రాణాలకు తెగించి పోరాడిన నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం. నువ్వు ఎన్ని చేసినా నీ అవినీతిని బయట పెట్టకుండా ఊరుకోము. నీ చిట్టాలను బయటపెడుతూనే ఉంటాం.

సింగరేణిలో సోలార్ పవర్ స్కాం

107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ లో పెద్ద కుంభకోణం జరిగింది. మూడు వేరువేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టేది ఉంటే తమ అనువాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి ఎమ్మెస్ఎంఈలు పాల్గొనకుండా ఉండేందుకు మూడు సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారు.. ఇందులో ఎమ్మెస్ఎంఎల్ఈలు పాల్గొనకుండా, పారిశ్రామికవేత్తలు పాల్గొనకుండా సోలార్ పవర్ ప్లాంట్ ని ఎత్తుకపోవడానికి సైట్ విసిట్ సర్టిఫికెట్ అనే కండిషన్ను పెట్టారు. వారు అనుకున్నటువంటి వారికి 250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్లను కట్టబెట్టారు.. ఈ టెండర్ను గిల్టీ పవర్ లిమిటెడ్ అనే కంపెనీకి అప్పచెప్పారు.. దేశవ్యాప్తంగా సోలార్ పవర్ పై టెండర్లు కొనసాగుతున్నాయి. ఒక మెగావాట్ సోలార్ ఉత్పత్తి చేయడానికి మూడున్నర కోట్లు అవుతుంది. పైగా భూమి కూడా సోలార్ కంపెనీలదే ఉంటుంది. ఇక్కడ సింగరేణి భూమిలో సోలార్ ప్లాంట్లు పెట్టి సోలార్ పవర్ ఉత్పత్తి చేసినందుకు ఒక మెగావాటుకు 5కోట్ల 4 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి ఆ కాంట్రాక్టర్కు చెల్లించబోతున్నది. 540 కోట్ల ఈ టెండర్ను వారికి కావాల్సినవారికి కట్టబెట్టారు.. సింగరేణి దాదాపు 200 కోట్లు అదనంగా చెల్లించాలి. నీ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది.. ఈ సోలార్ పవర్ స్కామ్ రామగుండంలో జరిగింది.. *నెంబర్ 3 సోలార్ పవర్ స్కాం.. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్..* దాదాపు ఏడు కోట్లకు ఒక మెగావాటు సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంట్ ను కట్టపెట్టారు.. నేషనల్ ఆవరేజ్ కంటే ఇది డబల్ కాస్ట్. 480 కోట్లకు వారికి కావలసిన కంపెనీకి కట్టబెట్టారు.. ఈ కంపెనీకి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనలు మార్చడం తమ అనువాయులకు కట్టబెట్టడం. అక్కడో 250 కోట్లు ఇక్కడ 250 కోట్లు నేరుగా చేతులు మారాయి. 500 కోట్లు అదనంగా చెల్లింపులు జరిగాయి. రేపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు కొత్తగూడెంలో సింగరేణి హెడ్ ఆఫీస్ కి వెళ్లి రివ్యూ చేస్తున్నారు అని మాకు సమాచారం ఉంది. కిషన్ రెడ్డి గారు రెండేళ్లు బొగ్గు మంత్రిగా ఉన్నా కూడా ఇప్పటిదాకా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ బయట పెడితేనే ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ అయింది, ఢిల్లీ కిషన్ రెడ్డి గల్లీ కి వచ్చి కొత్తగూడెంలో సింగరేణిపై మీటింగ్ పెడుతున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి ఈ కుంభకోణంపై నేను విచారణ జరపాలని డిటైల్డ్ లెటర్ రాస్తున్నాను.. మూడోది సింగరేణిలో ఎక్స్ ప్లోజింగ్ స్కాం.. జిలెటిన్ స్టిక్స్ వాడతారు సింగరేణిలో ఎక్స్ ప్లోజింగ్ కోసం.. ఆ జిలేటిన్ స్టిక్స్ కొనుగోలులో 30% రేటు అదనంగా పెట్టి కొనాలని ఒత్తిడి తెచ్చారు. జీవీ రెడ్డి అనే ఒక డైరెక్టర్ 30% ఎక్కువ రేటుకు కొనడానికి నిరాకరిస్తే ఒత్తిడి చేస్తే చివరికి రాజీనామా చేసి వెళ్లిపోయాడు. తర్వాత ఇంకో డైరెక్టర్ వికే శ్రీనివాస్. ఆయన కూడా నిన్న సంతకం పెట్టను అని నిరాకరిస్తే ఆయనను డైరెక్టర్ నుంచి జీయం పదవికి రివర్స్ చేశారు.. ఇలా బెదిరించి భయపెట్టి నిబంధనలు మార్చి కోట్లాది రూపాయల స్కాంకు తెరదీస్తున్నారు.. *ప్రకాశం ఖని స్కాం 4 …* దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ అనేది పెట్టడం వల్లనే ఈ స్కాం బయటపడింది. ఇక్కడ కూడా సైట్ విసిట్ సర్టిఫికెట్ పెట్టి టెండర్ ని పిలిచారు. ఫిబ్రవరి రెండో తారీఖు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ కూడా రింగు చేస్తున్నారు.. మరి సైట్ విసిట్ విధానం తప్పయితే ప్రకాశం గని టెండర్ ని కూడా రద్దు చేయాలి.. 1044 కోట్లతో సైట్ విసిట్ సర్టిఫికెట్ పెట్టి ఈ టెండర్ ని కూడా పిలిచారు కాబట్టి ప్రకాశం గని టెండర్ ని కూడా తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. *శ్రీరాంపూర్ ఓబీ,మరో స్కామ్. స్కాం నెంబర్ 5:* శ్రీరాంపూర్ లో ఓబి 600 కోట్ల వర్క్ టెండర్ పిలిచారు.. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్డు కోసం ఏడుసార్లు డేట్ ఇచ్చి వాయిదా వేశారు.. రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డి చెప్పుడు ఫైనాన్షియల్ బిడ్డును వాయిదా వేయడం ఇలా ఏడుసార్లు జరిగింది. హైదరాబాద్ హోటల్లో ముఖ్యమంత్రి బావమరిది సృజన రెడ్డి సెటిల్మెంట్లు కుదరకపోవడం వల్ల ఏడుసార్లు వాయిదా వేశారు. ఎందుకు శ్రీరాంపూర్ ఓబీ టెండర్ ఏడుసార్లు వాయిదా పడ్డదో కిషన్ రెడ్డి గారు విచారణ చేపట్టాలి ఇది కూడా సైట్ విసిట్ సర్టిఫికెట్ తోనే టెండర్లను ఖరారు చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినంక మొత్తం సైట్ విసిట్ సర్టిఫికెట్ తో 6 ఓబి కాంట్రాక్టర్లకు టెండర్లు పిలిచారు. ఈ ఆరు ఓబి కాంట్రాక్టర్లను వెంటనే రద్దు చేయాలి. సైట్ విసిట్ సర్టిఫికెట్తో టెండర్లను పిలిచిన ప్రతి టెండర్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జైపూర్ లో సింగరేణి కడుతున్న థర్మల్ పవర్ ప్లాంట్ లో కూడా అవకుతవకలు జరిగాయి. వాటి మీద కూడా త్వరలో సమాచారం బయట పెడతాం. వాటి మీద కూడా కిషన్ రెడ్డి గారు విచారణ జరిపించాలి. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే నీ బావమరిది సృజన్ రెడ్డిపై సిట్ వెయ్యు. సింగరేణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ కిషన్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాను కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటివరకు పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, పూర్తి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణ సిట్టింగ్ జడ్జితో జరుపుతారో, సిబిఐతో జరుపుతారో మీ ఇష్టం. అన్ని విషయాలు బయటకు తేవాలని డిమాండ్ చేస్తున్నాం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *