పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం..

హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్  కీలక ఒప్పందం
2,000 
మంది ఉద్యోగులతో  గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటు

మెక్ డొనాల్డ్ సంస్థ తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను  ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే పోటీ చేయాలని దేశంలోని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయని చెప్పారు. మెక్ డోనాల్డ్ సంస్థకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. దీంతో  2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.


ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా చర్చల్లో ఉన్నారు.


మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. సంస్థకు అవసరమైన శిక్షణ నైపుణ్యం ఉన్న ఉద్యోగులను నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని సూచించారు.  యూనివర్సిటీని స్కిల్ జోన్ గా ఉపయోగించుకొనిఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్ లోనే కాకుండాదేశ విదేశాల్లో తమ ఆఫీసులుఅవుట్ లెట్లలో ఉద్యోగాలు కల్పించాలన్నారు. మెక్‌డొనాల్డ్స్‌కు అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతులు సమకూర్చేలా అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దీంతో రైతుల ఆదాయం పెరుగుతుందనిరాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు.


బెంగళూరు లాంటి ఇతర సిటీలతో పోలిస్తే హైదరాబాద్‌లో ప్రతిభావంతులైన నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలునాణ్యమైన జీవన ప్రమాణాలున్నాయని మెక్ డొనాల్డ్ సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీ అన్నారు. అందుకే హైదరాబాద్ ను తమ గ్లోబల్ ఇండియా ఆఫీస్ సెంటర్ గా ఎంచుకున్నట్లు చెప్పారు.  ప్రపంచ వ్యాప్తంగా మెక్ డొనాల్డ్స్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించారు. తదుపరి సంప్రదింపులుప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.  ప్రస్తుతం తెలంగాణలో 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్‌ లెట్లున్నాయి. ప్రతి ఏడాది మరో 3 లేదా 4 కొత్త అవుట్ లెట్లను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. కొత్తగా గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటుతో రాష్ట్రంలోని యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *