నీ జామెట్రీ రేఖల సంగీతం
నా బ్రతుకు ఆల్జీబ్రా
బాటకు పాటయ్యింది.
నీ వెన్ చిత్రాల మాటల
సాన్నిహిత్యం నా భవిష్యత్ రాతకు
బిందుపథపు బాటయ్యింది.
నీ త్రికోణమితి సాహిత్యం
నా గుండె స్పందనల
ఆల్గారిథమ్ మాటయ్యింది.
నేనంతా
నాలో అంతా
నువ్వయ్యాక
గణితం నా నేస్తమై
భౌతికశాస్త్రం నా ఉద్యమమై
వన్ ప్లస్ వన్ అనంతంలో
“ఒకటే” అయ్యింది ఓ వింతలా..!
ఫిజిక్స్ అరుణ్ కుమార్
నాగర్ కర్నూల్
9394749536





