మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

హుస్నాబాద్‌లో పలువురు మంత్రుల పర్యటన

హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో రూ.11 కోట్ల 50 లక్షలతో నిర్మించిన నూతన 50 పడకల మాతా, శిశు ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించారు. అలాగే రూ.82 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న 250 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు, రూ.77.20 కోట్ల అంచనా వ్యయంతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్‌ వరకు ఉన్న రెండు వరుసల రహదారిని ప్యాకేజ్‌ 2 ద్వారా నాలుగు వరుసలుగా అభివృద్ధిపరిచే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు, భవనాలుచ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మానకొండూర్‌ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్‌ కే.హైమావతి, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ కేడం లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *