– స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు మాస్టర్ ప్లాన్
- ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తు పై పోటీ
హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి24: రాజకీయంగా బలపడడానికి అసవరమైన రీతిలో జాగృతి అధ్యక్షురాలు కవిత అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఇందుకు అవసరమైన విధంగా పునాదులు వేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిలబడాలన్న దిశగా వ్యూహం వేస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ జాగృతి నేతలు స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మున్సిపాలిటీలతోపాటు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లోనూ సింహం గుర్తుతో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నాయకత్వం నిర్ణయించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో సంప్రదింపులు పూర్తి చేసిన తెలంగాణ జాగృతి నాయకత్వం.. ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన చర్చల్లో ఈ అంశంపై ఏఐఎఫ్‌బీ పార్టీ, తెలంగాణ జాగృతి మధ్య సయోధ్య కుదిరినట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇప్పటికే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ పక్రియలో వేగం పెంచారు. అయితే, పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి కావడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా. ఈలోపు రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలతోపాటు జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లోనూ ఏఐఎఫ్‌బీ సింహం గుర్తుతో బరిలోకి దిగాలని జాగృతి నాయకత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె వల్ల ప్రధానంగా నష్టపోయేది బిఆర్‌ఎస్ పార్టీయే. ఇది కాంగ్రెస్‌కు లాభించగలదు. అలాగే బిజెపికి కొంత దెబ్బతినగలదని అంటున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.