హర్మూజ్‌ ‌జలసంధి వద్ద భారీ సైనిక చర్య

– 5 వేల పౌండ్ల డీప్‌ ‌పెనెట్రేటర్‌ ‌బాంబుల ప్రయోగం
– అమెరికా తీరుపై మండిపడుతున్న ఇరాన్‌

‌వాషింగ్టన్‌,‌ మార్చి 18: హర్మూజ్‌జలసంధిని మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సైన్యం భారీ సైనిక చర్యకు దిగింది. ఇరాన్‌ ‌తీరప్రాంతంలో ఉన్న కఠిన రక్షణ గల మిస్సైల్‌ ‌స్థావరాలపై 5 వేల పౌండ్ల డీప్‌ ‌పెనెట్రే టర్‌ ‌బాంబులను వరుసగా ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌ప్రకటించింది. ఈ స్థావరాల్లో ఉన్న యాంటీ షిప్‌ ‌క్రూజ్‌ ‌మిస్సైళ్లు హార్ముజ్‌ ‌మార్గంలో ప్రయాణించే అంతర్జాతీయ నౌకలకు పెద్ద ముప్పుగా మా రినట్లు తెలిపింది. ఈ దాడులతో ఆ ముప్పును నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. అమెరికా ఇజ్రాయెల్‌ ‌యుద్ధానికి ప్రతిగా ఇరాన్‌ ‌హార్ముజ్‌ ‌జలసంధిని మూ సివేయడంతో ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు ప్రభావితమైంది. అనేక దేశాలకు చెందిన చమురు నౌకలు అక్కడే నిలి చిపోవడంతో సముద్ర రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ పరిణామాల మధ్య హార్ముజ్‌ ‌భద్రత కోసం సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మిత్ర దేశాలను కోరినా పెద్దగా స్పందన రాలేదు. నాటో దేశాలు కూడా సైనిక సహాయం విషయంలో వెనుకంజ వేశాయి. ’మేము ఎంతోసహాయం చేసినప్పటికీ మాకు మద్దతు రావడం లేదు’ అంటూ ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. అణు ఆయుధాల అభివృద్ధి దిశగా తాము సాగుతున్నామన్న అమెరికా ఆరోపణల ను ఇరాన్‌ ‌ఖండించింది. తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుత అవసరాలకే పరిమితమ ని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌ ‌ప్రధాని బెంజమిన్‌ ‌నెతన్యాహూ నెలలుగా ఒత్తిడి తీసుకువస్తున్న నేపథ్యంలో ట్రంప్‌ ఈ ‌యుద్ధని ర్ణయాన్ని ముందుకు నెట్టినట్లు అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. బంకర్‌ ‌బస్టర్‌ ‌గా పిలిచే ఈ డీప్‌ ‌పెనెట్రేటర్‌ ‌బాంబులు భూమిలో లోతుగా దాగి ఉన్న లేదా బలమైన కాంక్రీట్‌ ‌నిర్మాణాల్లో ఉన్న లక్ష్యాలను ఛేదించి పేలేలా రూపొందించారు. ఒక్కో బాంబు ధర లక్షల డాలర్ల వరకు ఉంటుందని అంచనా. గతంలో అమెరికా మరింత భారీ 30 వేల పౌండ్ల బాంబులను కూడా వినియోగించినప్పటికీ, ప్రస్తుత దాడిలో ఉపయోగించినవి. కీలక లక్ష్యాలను కచ్చితంగా ధ్వంసం చేసే విధంగా ప్రయోగించినట్లు సమాచారం.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *