– మొత్తం 45మంది బదిలీ ఉత్తర్వులు
– పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 45 మంది ఐఏఎస్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో కలెక్టర్ల స్థాయిలో పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. పలు జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. మహబూబాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. టీఎస్‌జీపీడీసీఎల్‌కు కొత్త సీఎండీ నియామకం జరిగింది. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్యకార్యదర్శిగా రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సంజయ్‌కుమార్, విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా దాన కిషోర్‌ను నియమించారు. ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ విభాగం కార్యదర్శిగా గౌరవ్ ఉప్పల్, దేవాదాయశాఖ కమిషనర్‌గా ఎం.హనుమంతరావు, ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా డి.దివ్యను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు పలు జిల్లా కలెక్టర్లనూ ప్రభుత్వం బదిలీ చేసింది. యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా అనురాగ్ జయంతిని నియమించింది.పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సంజయ్ కుమార్‌ను నియమించారు. విపత్తు నిర్వహణ, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా దాన కిషోర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీధర్‌ను నియమించారు. ఎండోమెంట్స్ కమిషనర్‌గా హనుమంతరావుకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఫైనాన్స్ శాఖ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్‌ను నియమించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్.శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా చిత్రా మిశ్రాను నియమించారు. విజయేంద్ర – మహబూబ్‌నగర్ కలెక్టర్ పదవి నుంచి సోషల్ వెల్ఫేర్ శాఖ కార్యదర్శిగా నియామకం అయ్యారు. అద్వైత్ కుమార్ సింగ్ – మహబూబాబాద్ నుంచి ఢిల్లీ తెలంగాణ భవన్ సమన్వయ శాఖకు బదిలీ అయ్యారు. సిక్తా పట్నాయక్ – నారాయణపేట్ నుంచి ఆర్థిక శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సందీప్ కుమార్ ఝా – జనగాం కలెక్టర్‌గా నియామకం అయ్యారు. ముష్రఫ్ అలీ ఫారూఖీ – టీఎస్‌జీపీడీసీఎల్ సీఎండీగా నియామకం అయ్యారు. జితేష్ వి.పాటిల్ – టీఎస్‌జీపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. స్నేహ శబరీష్ – మహబూబాబాద్ కలెక్టర్‌గా నియామకం అయ్యారు. గరిమా అగర్వాల్- రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం జరిగింది. ప్రతిమ సింగ్ – మెదక్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అనికేత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ,చాహత్ బజ్పాయి – హనుమకొండ కలెక్టర్‌గా,ఖుష్బూ గుప్తా – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా , పమేలా సత్పతి – లేబర్ కమిషనర్‌గా, అనురాగ్ జయంతి – యాదాద్రి కలెక్టర్‌గా, ప్రదీప్ జైన్ – నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం జరిగింది.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





