– 10మంది మృతి, 12 మందికి గాయాలు
సిడ్నీ, డిసెంబర్ 14: ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలోని బొండీ బీచ్‌లో యూదు పండుగలో ఈ తెల్లవారు జామున (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 7.47 గంటలకు) ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిదిమంది మరణించగా పోలీసుల కాల్పుల్లో దుండగులలో ఒకరు మరణించారు. సుమారు 12 మంది గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో కాల్పులు జరిపిన వారిలో ఒకరు మరణించగా రెండో షూటర్ పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరిని అరెస్టు చేశామని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నారు. ఈ కాల్పుల ఘటనతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. మొత్తం 50 రౌండ్ల కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పుల సంఘటన తర్వాత సుమారు 12 మందిని స్థానిక హాస్పిటల్స్‌కు తరలించినట్లు న్యూ సౌత్ వేల్స్ ఆంబులెన్స్ ప్రతినిధి తెలిపారు. ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఈ సంఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఇలా జరగడం విచారకరం అన్నారు. ఇది తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. అత్యవసర సేవల సిబ్బంది ఘటన స్థలంలో సహాయక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కనీసం పది మంది చనిపోయి ఉన్నట్లు, రక్తం ధారగా ప్రవహిస్తోందని సంఘటనా సాక్షిగా ఉన్న 30 ఏళ్ల స్థానికుడు హ్యారీ విల్సన్ సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు చెప్పారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్ ఖండిరచారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన అక్టోబర్ 2023 నుంచి ఆస్ట్రేలియాలో యూదుల వ్యతిరేక దాడుల తీవ్రత పెరిగింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటైన బొండీ వేసవి సాయంత్రాల్లో స్థానికులు, పర్యాటకులతో సందడిగా ఉంటుంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





