మరో మూడు మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 25: మరో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్‌పర్సన్లను, వైస్‌ చైర్‌పర్సన్లను, నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూపాలపల్లి జిల్లా కాటారం, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌, మంథని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు నూతన కార్యవర్గాలను నియమించింది. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 167 మార్కెట్‌ కమిటీలకు నూతన పాలకవర్గాలను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నూతనంగా ఎంపికైన పాలకవర్గాలకు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *