– బస్తర్ జిల్లాలో 51మంది మావోయిస్టుల లొంగుబాటు
రాయపూర్, ఫిబ్రవరి 7:మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ జిల్లా బస్తర్ డివిజన్‌లో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిపై రూ.1.61 కోట్ల రివార్డు ఉంది. వీరంతా బస్తర్ ఎస్పీ జితేందర్ యాదవ్ సమక్షంలో శనివారంనాడు లొంగిపోయారు. బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయమైన జగదల్‌పూర్‌లో బస్తర్ పాండుమ్ 2026 ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్‌షా రాయపూర్ వచ్చిన రోజునే ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.కాగా, జిజాపూర్ జిల్లాలో 20 మంది మహిళా క్యాడర్‌తో సహా 30 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మరో 21 మంది సుక్మా జిల్లాలో లొంగిపోయారని ఎస్సీ సుందరరాజ్ తెలిపారు. వీరిలో 14 మంది మహిళా క్యాడర్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి జెలటిన్ స్టిక్‌లో స్వాధీనం చేసుకున్నామన్నారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు రూ.50 వేల తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పునరావాస చర్యలతో స్వచ్ఛందంగా వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. కాగా, తక్కిన మావోయిస్టు క్యాడర్ కూడా హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారికి భద్రత, గౌరవంగా జీవించేందుకు అవసరమైన పునరావసం కల్పిస్తామని సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





