– లొంగిపోయిన వారిపై 3.95 కోట్ల రివార్డు.
– రూ,3.61 కోట్ల నగదు, కిలో బంగారం స్వాధీనం
భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. క్రమక్రమంగా మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇటీవల ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలకు అటవీ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి నెలకొన్న పరిస్థితిలో మావోయిస్టు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో 108 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగి పోయారు. వీరిపై రూ.3.95 కోట్ల రివార్డు ఉందని అధికారులు తెలిపారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన బీజాపూర్ నుంచి 37 మంది, దంతేవాడలో 30 మంది, సుక్మాలో 18 మంది, బస్తర్ లో 16 మంది, నారాయణపూర్ లో నలుగురు, కాంకేర్ లో ముగ్గురు మావోయిస్టులు భారీగా వారి ఆయుధాలను అప్పగించారని వారు తెలిపారు. లొంగిపోయిన వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. లొంగిపోయిన వారు 101 ఆయుధాలను అప్పగించారని బస్తర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు. డివిజన్ ప్రధాన కార్యాలయంలో మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగింది. లొంగిపోయిన మావోయిస్టుల ఇచ్చిన సమాచారం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఉన్న డంపులను పూర్తిస్థాయిలో పసిగట్టారు. ఈ దాడుల్లో రూ, 3.61 కోట్లు నగదు లభించినట్లు, అంతేకాక కేజీ బంగారం లభించినట్లు ఐజి సుందర్ రాజ్ వివరించారు.
———————————————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




