Phones tap: మావోయిస్టుల పేర్లు చెప్పి ఫోన్లు టాప్‌ చేశారు

– నాతోపాటు రేవంత్‌రెడ్డి కూడా బాధితుడే
– ఆఖరుకు కేసీఆర్‌ కూతురు కవితనూ వదలలేదు
– వారందరినీ ఏం చేసినా పాపం లేదు
– సీఎం కోరితే క్షణాల్లో సీబీఐ దర్యాప్తు
– సిట్‌ విచారణకు హాజరైన కేంద్ర మంత్రి బండి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: బీఆర్‌ఎస్‌(BRS) హయాంలో జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌(phone tapping)పై విచారణ జరుపుతున్న సిట్‌ )SIT) వెల్ల‌డించిన‌ విషయాలకు షాక్‌ అయ్యానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ దిల్‌కుశ్‌ గెస్ట్‌హౌస్‌లో సిట్‌ విచారణకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకుముందు కార్యకర్తలు, నేతలు వెంట రాగా భారీ ర్యాలీగా మార్గంలోని ఖైరతాబాద్‌ హనుమాన్‌ ఆలయంలో పూజలు చేసి గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు. ఈ కేసులో బండి సంజయ్‌ స్టేట్‌మెంట్‌ను సిట్‌ అధికారులు రికార్డు చేశారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆధారాలను సిట్‌కు అందజేసినట్లు తెలుస్తోంది. 6,500 మంది ఫోన్లను కేసీఆర్‌ ప్రభుత్వం ట్యాప్‌ చేసినట్లు తెలుస్తోందని, మావోయిస్టుల పేర్లు చెప్పి తనతోపాటు అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోని మంత్రి హరీష్‌రావు, ఆనాటి మంత్రుల, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పోన్లను కూడా ట్యాప్‌ చేశారని ఆరోపించారు. తన ఫోన్‌ను ప్రతి క్షణం ట్యాప్‌ చేశారని, టీఎస్పీఎస్సీ గ్రూప్‌I1 పేపర్‌ లీక్‌ కేసును విచారించిన జడ్జి ఫోన్లను కూడా ఈ దుర్మార్గులు ట్యాప్‌ చేశారని, ఆఖరుకు కేసీఆర్‌ సొంత బిడ్డ కవిత ఫోన్లను కూడా ట్యాప్‌ చేసిన నీచులు వీళ్లు అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా మంచి పేరున్న ఎస్‌ఐబీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని, దాన్ని అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లు, లీడర్లను బెదిరించి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ప్రభాకర్‌ రావు, రాధాకిషన్‌ రావు వంటి లుచ్చాగాళ్లను ఏం చేసినా తప్పులేదన్నారు. ఈ ఫోన్ల ట్యాపింగ్‌ వెనుక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాత్ర ఉందని కుండ బద్దలు కొట్టారు. ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి దగ్గర రూ.7 కోట్లు పట్టుకున్నరు.. ఎస్‌ఐబీని అడ్డాగా చేసుకుని కాంగ్రెసోళ్ల దగ్గర కోట్ల రూపాయలు పట్టుకున్నరని, ఆ పైసలన్నీ ఎటుపోయినయ్‌.. ట్యాపింగ్‌ గ్యాంగ్‌ తిన్నదా.. ట్విట్టర్‌ టిల్లు తిన్నడా? తేల్చాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ఈడీకి ఎందుకు లేఖ రాయడం లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎస్‌ఐబీని అడ్డుపెట్టుకుని కేసీఆర్‌, ప్రభాకర్‌రావు చేసిన వసూళ్ల పర్వంపై తక్షణమే విచారణ జరపాలని లేఖ రాస్తే తక్షణమే ఈడీ విచారణ చేయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. కేసీఆర్‌, కేటీఆర్‌, సంతోష్‌ మినహా బీఆర్‌ఎస్‌ నేతల ఫోన్లన్నీ ట్యాప్‌ అయ్యాయన్నారు. సాక్షాత్తు రేవంత్‌ రెడ్డి కూడా బాధితుడే అయినా ఆయన ఎందుకు సిట్‌ విచారణకు హాజరు కావడం లేదెందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ తానా అంటే రేవంత్‌ తందానా అంటున్నారు.. అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ సూత్రధారులను అరెస్టు చేయడం లేదు.. ప్రశ్నిస్తున్న బీజేపీపై ఎదురు దాడి చేస్తూ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నరు అని వ్యాఖ్యానించారు. సీఎం కూడా వెంటనే సిట్‌ విచారణకు హాజరై స్టేట్‌ మెంట్‌ ఇవ్వాలన్నారు. జడ్జీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్లు ఆధారాలున్నందున వారిని కూడా పిలిచి వాళ్ల స్టేట్‌మెంట్‌ రికార్డు చేసే అధికారం సిట్‌ పోలీసులకు ఉన్నదా. ముఖ్యమంత్రి స్టేట్‌మెంట్‌ అడిగే అధికారం ఈ సిట్‌కు ఉందా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆనాటి సీఎం కేసీఆర్‌, ఆయన కొడుకు ట్విట్టర్‌ టిల్లును పిలిచి విచారించే దమ్ము సిట్‌కు ఉందా? దేశవ్యాప్తంగా తెలంగాణ పరువును మంట కలిపిన వ్యవహారమిది.. సాక్షాత్తు నాటి రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాచేలా నీచానికి పాల్పడిరసశ్రీవ సిట్‌ విచారణ పేరుతో ఇక డ్రామాలు ఆపండి
సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాయండి మీరు లేఖ రాస్తే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధం సీబీఐ నేరుగా విచారణ చేసే అధికారముంటే కేసీఆర్‌, ఆయన కొడుకును ఎప్పుడో బొక్కలో వేసేవాళ్లం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *