పోలీస్ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు 

ఒక ఏఎస్పి మృతి. ఒక ఎస్సై సీఐ కి తీవ్ర గాయాలు ..
భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్ 09 : ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో దారుణం జరిగింది. ఏ ఎస్ పి ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ సంఘటనలు ఏ ఎస్ పి ఆకాశ్ రావు మృతి చెందారు. ఈయనతోపాటు ఒక సీఐ ఒక ఎస్సై తీవ్ర గాయాలు పాలైనట్లు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే చత్తీస్గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో గొల్లపల్లి రోడ్డులో ఉన్న బేస్ క్యాంప్ సమీపంలో మావోయిస్టులు శక్తివంతమైన బాంబును అమర్చారు. పోలీస్ వాహనం అటుగా వెళుతున్న విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు ఒక్కసారిగా బాంబును పేల్చివేశారు. ఈ సంఘటనలో ఏఎస్పి ఆకాశరావు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇది గమనించిన భద్రతాపలుగాలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతేకాకుండా ఒక సీఐ ఒక ఎస్సై కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది .మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు .ఇప్పటికే వేల సంఖ్యలో మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. ఈ సంఘటనతో మావోయిస్టులు పగతో రగిలిపోతున్నారు. ప్రతి కార్య చర్య తీసుకోవడం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అదును చూసిన మావోయిస్టు శక్తివంతమైన బాంబులు పేల్చారు .ఈ సంఘటనలో పోలీసు ఉన్నత అధికారి మృతి చెందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *