~ దళిత వర్గాల్లో మద్దతు కోసం పార్టీ యత్నం
~ భద్రతా వ్యవస్థకు సవాళ్లు తప్పవా?
జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: మావోయిస్టు కేంద్ర కమిటీకి కొత్త కార్యదర్శిగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్ జి బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీ వ్యూహాత్మక దిశలో ఒక ముఖ్యమైన మలుపుగా పరిగణించవచ్చు. నంబాల కేశవరావు అలి యాస్ బసవరాజు ఎన్ కౌంటర్ మృతి తర్వాత కేంద్ర స్థాయిలో మూడున్నర నెలలుగా ఏర్పడిన శూన్యాన్ని ఈ నియామ కం భర్తీ చేసింది. తిప్పరి తిరుపతి సాధారణ నాయకుడు కాదు. జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ కు చెందిన దళితవర్గ నాయకుడైన ఆయన గత నలభై రెండు ఏళ్లుగా నిరంతరాయంగా మావోయిస్టు సిద్ధాం తానికి కట్టుబడి పనిచేస్తున్నారు. గ్రామీణ పేదలు, దళితులు, గిరిజన వర్గాల సమస్యలను ఆయుధపూర్వక పోరాటం ద్వారానే పరిష్కరించవచ్చని నమ్మకం ఆయన లో బలంగా ఉంది. ఈ క్రమంలో ఆయన పార్టీ అంతర్గతంగా ఒక క్రమశిక్షణా పరుడు, సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యూహ కర్తగా ఎదిగారు. దళిత వర్గానికి చెందిన నాయకత్వాన్ని ముందుకు తేవడం ద్వారా మావోయిస్టు పార్టీ తమకు వర్గపరమైన మద్దతు పెంచుకోవాలని చూస్తోంది. దళితు లను ఆకర్షించడం ద్వారా మిగిలిన వర్గాలపై కూడా ప్రభావం చూపాలని పార్టీ లెక్కలు వేసే అవకాశం ఉంది. అయితే మరోవైపు ఈ పరిణామం
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





