పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు

జనగామ, ప్రజాతంత్ర, నవంబర్ 2 : మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరించిన అజ్ఞాత నాయకుడు, దండకారణ్య స్పెషల్ జోనల్, డివిజనల్ కమిటీ సెక్ర టరీస్థాయి నాయకుడు లోకేటి రమేష్అలియాస్ అశోక్ అలియాస్ నరేందర్ @ రాజేశ్వర్ వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సమక్షంలో మంగళవారం జనజీవన స్రవంతిలో కలిశాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రమేష్ రెండు దశా బ్దాలుగా దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు చేస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు ,జన జీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకొని తాను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని డీసీపీ ఎదుట జనజీవన స్రవంతిలో కలిసానని తెలిపాడు. జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో విలేక‌రుల‌ సమావేశంలో డిసిపి మాట్లాడుతూ ఆ పార్టీలో కొనసాగుతున్న మిగతావారు కూడా లొంగిపోవాలని సూచించారు. వారికి ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయసహకారాలతోపాటు పునరావాసాన్ని కూడా అందిస్తామన్నారు. అతనిపై ఉన్న‌ రూ.8 లక్షల రివార్డులో రూ.25,000 లను అందజేశారు. మిగతా డబ్బులను డి.డి ద్వారా తదుపరి ఇస్తామన్నారు. స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయించుకునే అజ్ఞాత మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సమగ్ర పునరావాస కార్యక్రమం కింద పూర్తిస్థాయి మద్దతు, రక్షణ అందించనున్న‌ట్లు డీసీపీ తెలిపారు. కార్యక్రమంలో జనగామ టౌన్, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *