హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యురాలు, మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నాయకురాలు సుజాతక్క తెలంగాణ పోలీసుల ఎదుట శనివారం లొంగిRపోయారు. ఆమెపై రూ.కోటి రివార్డు ఉంది. వివిధ రాష్ట్రాల్లో 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. సుజాతక్క లొంగుబాటు మావోయిస్టు కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఆమె అసలు పేరు పోతుల కల్పన. 1984లో ప్రముఖ మావోయిస్టు నాయకుడు కిషన్జీ అలియాస్ మల్లోజుల కోటేశ్వరరావును వివాహం చేసుకున్నారు. ఆయన 2011లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. అప్పటినుంచి సుజాత మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో కీలక సభ్యురాలిగా, ఆయుధాల సేకరణ, రిక్రూట్‌మెంట్, వ్యూహాత్మక నిర్ణయాల్లో పాల్గొనేవారు. బస్తర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆమెపై హత్యలు, దాడులు, దోపిడీలు, పేలుడు పదార్థాల సేకరణ వంటి ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఆమె లొంగిపోవడంతో మావోయిస్టు నెట్‌వర్క్ గురించి మరింత సమాచారం లభించే అవకాశం ఉంది అని పోలీసులు ప్రకటించారు. సుజాతక్క ఆరోగ్య సమస్యలు, సంస్థలో అంతర్గత విభేదాలు, పోలీసుల ఒత్తిడి కారణంగా లొంగిపోయినట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





