రాంచీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: దశాబ్దాల కాలంపాటు అణగారిన వర్గాల విముక్తి కోసం, శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా జార్ఖండ్‌లోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.శ్వాసకోశ ఇబ్బందులతో రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 2021 నవంబర్ 12న జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్సావాన్ జిల్లాలో ఆయన్ను తన భార్య షీలా మరాండీ(మావోయిస్టు కేంద్ర కమిటీ మెంబర్)సహా పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రశాంత్ బోస్,నాటి నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. ఒక మేధావిగా, సిద్ధాంతకర్తగా వ్యవహరించారు. తన మేధస్సును దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం కావాలనే లక్ష్యం కోసం వెచ్చించారు. సుఖవంతమైన జీవితాన్ని తృణీకరించి దట్టమైన అరణ్యాల్లో, కటిక పేదరికం అనుభవిస్తున్న ప్రజల మధ్య ఉంటూ వారిని చైతన్యపరిచారు. భారత విప్లవోద్యమ చరిత్రలో 2004 సెప్టెంబర్ 21 ఒక మైలురాయి. విడివిడిగా ఉన్న పీపుల్స్ వార్, ఎంసీసీలను ఏకం చేసి సిపిఐ (మావోయిస్టు) పార్టీ ఏర్పాటులో ప్రశాంత్ బోస్ పోషించిన పాత్ర చిరస్మరణీయం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




