– ఆపరేషన్ కగార్ విజయవంతం అయినట్లే
– పార్టీ పతనంపై ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 18: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్లే భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. అగ్రనాయకులంతా హతం కావడం, ఉన్నవా రు లొంగిపోవడం, మావోలకు ప్రజల్లో మద్ద తు కరువవ్వడం వంటి కారణాలతో వారి ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. ఎన్ కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు మరో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనపై ప్రొ. హరగోపాల్ హైదరాబాద్లో స్పందించా రు. 25 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో లేవన్నారు. అలాగే ప్రజ ల నుంచి ఆశించిన స్థాయిలో వారికి మద్దతు లేదని చెప్పారు. మావోయిస్టు పార్టీ పూర్తిగా అంతమైనా ఆదివాసీల ఉద్యమాలు మాత్రం ఆగవని ప్రొ. హరగోపాల్ కుండబద్దలు కొట్టారు. పార్టీలోని భిన్నాభి ప్రాయాలు, విభేదాల వల్లే మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడి దని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యంలోని మార్పులు, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి సపో లేక పోవడం కూడా ఒక కారణమని ఆయనా స్పష్టం చేశారు. మావోయిస్టుల్లో చీలికలు, వి దాలు, అభిప్రాయ బేధాలు వలన మావోయిస్టు పార్టీ క్షీణించిందని చెప్పారు. కేంద్ర కమిట్ నేతలు.. ప్రభుత్వం ఎదుట లొంగుబాటుకు వా రి వారి వ్యక్తిగత అభిప్రాయాలు, కారణాలు ఉన్నాయని ఆయన విశ్లేషించారు. మూడు రాష్ట్రాల పోలీసుల తోపాటు, కేంద్ర ప్రభుత్వం సైతం హిడ్మాపై ఫోకస్ పెట్టిందన్నారు. హిడ్మా మావోయిస్టు పార్టీలో చాలా బలమైన నాయ కుడని అభివర్ణించారు. పార్టీ కోసం ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అన్నారు. ఏదైనా లక్ష్యం నిర్దేశిస్తే పూర్తి చేయగలడనే ఒక బలమైన నమ్మకం హిడ్మా పార్టీలో బలంగా ఉందని తెలిపారు. ప్రభుతా లు టెక్నాలజీ, ఆయుధాలు, డ్రోన్లతో అటవీ ప్రాంతాలను జ్లలెడ పడుతున్నాయన్నారు. వాటిని మావోయిస్టు పార్టీ తట్టుకోలేక పోయిందని వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





